President Of India: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయను.. దీదీ భేటీలో తేల్చిచెప్పిన పవార్

  • పోటీకి మొదటి నుంచి విముఖంగానే ఎన్సీపీ అధినేత
  • మరో అభ్యర్థిని వెతికే పనిలో విపక్షాలు
  • గోపాల‌కృష్ణ గాంధీ పట్ల మొగ్గు
Sharad Pawar Refuses To Run For President

రాష్ట్రపతి ఎన్నికల్లో  అధికార ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్న విపక్షాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విపక్షాల నుంచి బలమైన అభ్యర్థి అనుకుంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ట్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ పోటీకి ససేమిరా అన్నారు. 

తన అభ్యర్థిత్వంపై మొదటి నుంచి విముఖంగా ఉన్న పవార్.. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో బుధ‌వారం ఏర్పాటు చేసిన విపక్షాల కీలక భేటీలో పాల్గొన్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చిచెప్పారు. దాంతో, విపక్షాలు మరో అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో వెంక‌య్య‌నాయుడిపై పోటీ చేసి ఓడిపోయిన గోపాల‌కృష్ణ గాంధీని రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపాలని దీదీ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై విపక్షాలు చర్చిస్తున్నట్టు సమాచారం.    

 రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమికి ఎలక్ట్రోరల్ కాలేజీలో దాదాపు సగం ఓట్లు ఉన్నాయి. వీటికి తోడు వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, ఏఐడీఎంకే పార్టీలు మద్దతిస్తే ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం సులువు అవుతుందని బీజేపీ ధీమాగా ఉంది. 

More Telugu News