Kapil Dev: సంజు శాంసన్ లో ఉన్న మైనస్ పాయింట్ ఇదే: కపిల్ దేవ్

Sanju Samson lacks consistency says Kapil Dev
  • సంజు ప్రతిభ ఉన్న ఆటగాడేనన్న కపిల్ 
  • రెండు మ్యాచ్ లు బాగా ఆడిన తర్వాత.. అదే స్థిరత్వాన్ని కొనసాగించలేడని కామెంట్ 
  • ఇషాన్ కిషన్ ఒత్తిడికి గురవుతున్నాడన్న కపిల్ 

టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజులో చాలా ప్రతిభ ఉందని చెప్పారు. అయితే ఒకట్రెండు మ్యాచ్ లలో బాగా ఆడిన తర్వాత... అదే స్థిరత్వాన్ని కొనసాగించడంలో విఫలమవుతాడని అన్నారు. అతనిలో ఉన్న మైనస్ పాయింట్ ఇదేనని చెప్పారు. ప్రస్తుతం నిలకడగా ఉన్న వికెట్ కీపర్లలో దినేశ్ కార్తీక్ అందరికంటే ముందున్నాడని అన్నారు. ఇషాన్ కిషన్ ఒత్తిడికి లోనవుతున్నాడని... టీ20 వేలంలో అతను భారీ ధర పలకడమే దానికి కారణమై ఉండొచ్చని చెప్పారు. తనకు ఇంత వరకు అంత డబ్బు ఎప్పుడూ రాలేదని... అందుకే దాని గురించి కచ్చితంగా చెప్పలేనని అన్నారు.

  • Loading...

More Telugu News