TDP: గంటా మ‌న‌వ‌డి పుట్టిన రోజు వేడుక‌ల‌కు చంద్ర‌బాబు హాజ‌రు

chandrababu attends ganta srinivasa rao grand sons birth day celebrations
  • విశాఖ‌లో వేడుక‌గా గంటా మ‌న‌వ‌డి బ‌ర్త్ డే
  • స్వ‌యంగా హాజ‌రైన చంద్ర‌బాబునాయుడు
  • జిల్లాల ప‌ర్య‌ట‌న కోసం అన‌కాప‌ల్లి వెళ్లిన చంద్ర‌బాబు
  • విశాఖ‌లో ఆగి గంటా ఇంటికి వెళ్లిన వైనం
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌న‌వ‌డి పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం విశాఖ‌లోని గంటా ఇంటిలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌లో గంటా మ‌న‌వ‌డిని ఎత్తుకుని మ‌రీ చంద్రబాబు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. బ‌ర్త్ డే వేడుకల్లో భాగంగా కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మంలోనూ చంద్ర‌బాబు పాలుపంచుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా గంటా కుమారుడు రవితేజను చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. 

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ.. తన మనవడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైనందుకు చంద్రబాబు అన్నకు ధన్యవాదాలు అంటూ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే... బుధ‌వారం నుంచి చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా త‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం నుంచి ప్రారంభించ‌నున్నారు. ఇందుకోసం బుధ‌వారం ఉద‌యం విశాఖ వెళ్లిన చంద్ర‌బాబు...గంటా ఇంట బ‌ర్త్ డే వేడుక‌ల స‌మాచారం తెలుసుకుని అక్క‌డికి వెళ్లి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.
TDP
Chandrababu
Ganta Srinivasa Rao
Birth Day
Vizag
Anakapalli
Districts Tour

More Telugu News