బెల్లంకొండ గణేశ్ 'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ ఖరారు!

  • 'స్వాతిముత్యం'గా బెల్లంకొండ గణేశ్ 
  • ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ 
  • కథానాయికగా వర్ష బొల్లమ్మ 
  • ఆగస్టు 13వ తేదీన సినిమా విడుదల
Swathimuthyam movie release date confirmed

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు. ఆయన ఎంట్రీనే మాస్ సినిమాతో జరిగింది. అప్పటి నుంచి కూడా తన సినిమాల్లో మాస్ కంటెంట్  తగ్గకుండా చూసుకుంటున్నాడు. మా స్ కంటెంట్ పుష్కలంగా ఉన్న 'ఛత్రపతి' రీమేక్ తోనే బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. 

ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడు బెల్లంకొండ గణేశ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'స్వాతి ముత్యం' అనే సినిమాలో సాఫ్ట్ కేరక్టర్ తో ఆయన తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. 

 ఆగస్టు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. నరేశ్ .. ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News