Bullet proof vehicle: కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ కి ఏడు రోజుల పోలీసు కస్టడీ

  • మన్సా చీఫ్ జ్యుడీషియల్ కోర్టు అనుమతి
  • మన్సా నుంచి మొహాలీకి బిష్ణోయ్ తరలింపు
  • భారీ భద్రత కల్పిస్తున్న రాష్ట్ర యంత్రాంగం
Bullet proof vehicle 100 cops Punjab Police top notch security for gangster Lawrence Bishnoi

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి మన్సాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. దీంతో అతడ్ని మన్సా నుంచి మొహాలికి తరలించనున్నారు. 100 మంది పోలీసులు, 24 వాహనాల కాన్వాయ్, బుల్లెట్ ప్రూఫ్ కారులో అతడ్ని తీసుకెళుతున్నారు. నేరస్థుల కోసం మన వ్యవస్థలు ఎంతగా ఖర్చు చేస్తున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 

మొహాలీకి తరలించిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్), యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్, ఇతర దర్యాప్తు విభాగాలు బిష్ణోయ్ ను విచారించనున్నాయి. సిద్ధూ మసేవాలా హత్య కేసులో అతడి పాత్ర, ఇతరులు ఎవరున్నారనే విషయాలను రాబట్టనున్నారు. మే 29న ఉదయం మూసేవాలా ఆగంతుకుల కాల్పులకు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 

More Telugu News