TRS: టీఆర్ఎస్ కీలక నిర్ణయం.. నేటి మమతా బెనర్జీ సమావేశానికి దూరం

  • కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై టీఆర్ఎస్ కినుక
  • పార్టీ నేతలతో చర్చించిన అనంతరం దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
  • రాష్ట్రపతి ఎన్నికల్లో తమ వైఖరిని తర్వాత ప్రకటిస్తామన్న టీఆర్ఎస్
TRS Away from Mamata Banerjee meet

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుని అధికార బీజేపీకి షాకివ్వాలని భావిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపక్ష పార్టీలతో నేడు ఢిల్లీలో సమావేశమవుతున్నారు. ఈ మేరకు ఆమె నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. తన నివాసానికి వెళ్లడానికి ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన అందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సహా 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు మమత లేఖలు రాశారు. అయితే, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము వచ్చేది లేదని ఇటీవలే తేల్చి చెప్పిన టీఆర్ఎస్.. అనుకున్నట్టే ఈ సమావేశానికి డుమ్మా కొడుతోంది. సమాశానికి హాజరు కావాలా? వద్దా? అన్న విషయమై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్..  చివరికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు తాము సమదూరం పాటిస్తామని, తమ వైఖరేంటో తర్వాత ప్రకటిస్తామని టీఆర్ఎస్ తెలిపింది.

  • Loading...

More Telugu News