చిన్నారులకు మోడ్రన్ క్రాఫు చేసిన ఎమ్మెల్యే సీతక్క... వైరల్ అవుతున్న వీడియో

  • రచ్చబండకు వెళుతూ మార్గమధ్యంలో ఆగిన సీతక్క
  • చిన్న కుంట వద్ద బాలలకు క్రాఫ్
  • నగరాల్లో ఇలాంటి ఆనందాలు దొరకవని వెల్లడి
Seethakka made modern hair styling to boys

నిరాడంబర జీవితానికి మారుపేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంలా ఆమె నిత్యం ప్రజల్లోనే ఉంటారు. తాజాగా, సీతక్క కొందరు చిన్నారులకు మోడ్రన్ హెయిర్ స్టయిలింగ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో ఓ చిన్న కుంట వద్ద ఆగారు. స్వయంగా కత్తెర చేతబూని కొందరు చిన్నారులకు లేటెస్ట్ మోడల్ క్రాఫు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె స్వయంగా పంచుకున్నారు. 

నగరాల్లో పెద్ద పెద్ద భవంతులు ఉంటాయని, భారీ మౌలిక సదుపాయాల వ్యవస్థలు కనిపిస్తుంటాయని సీతక్క పేర్కొన్నారు. అయతే, చిన్న చిన్న కుంటల్లో స్నానం చేయడం, సహచరులతో కలిసి ఆడుకోవడం వంటి ఆనందాలను నగరాలు ఇవ్వలేవని అభిప్రాయపడ్డారు. రచ్చబండకు వెళుతుండగా ఈ పిల్లలను చూడగానే పాతజ్ఞాపకాలు మనసులో మెదిలాయని వివరించారు.

More Telugu News