Deepika Padukone: కామినేని ఆసుప‌త్రిలో బాలీవుడ్ హీరోయిన్‌ దీపిక ప‌దుకొణే

deepika padukone rushed to kamineni hospital deu to increase heart beat
  • షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్ వ‌చ్చిన దీపిక‌
  • ఉన్న‌ట్టుండి హార్ట్ బీట్ పెరిగిన వైనం
  • ఆందోళ‌న‌తో కామినేని ఆసుప‌త్రికి వ‌చ్చిన హీరోయిన్‌
  • నోవాటెల్‌లో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దీపిక‌
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక ప‌దుకొణే మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని కామినేని ఆసుప‌త్రిలో చేరారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉంటున్న దీపికకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి హార్ట్ బీట్ పెరిగిపోయింద‌ట‌. దీంతో కంగారుప‌డ్డ ఆమె షూటింగును ర‌ద్దు చేసుకుని హుటాహుటీన కామినేని ఆసుపత్రికి వ‌చ్చారు. 

అక్కడ ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం ఆమె తాను బ‌స చేసిన నోవాటెల్ హోట‌ల్‌కు వెళ్లిపోయారు. నోవాటెల్‌లోనూ ఆమె వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం దీపిక ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని ఆమెకు వైద్యులు సూచించిన‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Deepika Padukone
Kamineni Hospital
Bollywood
Novatel
Heart Beat

More Telugu News