India: వరుసగా ఐదో సారి.. ఆసియాకప్ ఫైనల్స్ కు భారత్ 

  • ఫిలిప్పీన్స్ పై కంబోడియా విజయంతో ఖరారు
  • తుది క్వాలిఫయింగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే అర్హత
  • ఈ నెల 17న హాంగ్ కాంగ్ తో పోటీ పడనున్న భారత జట్టు
India qualify for Asian Cup 2023 Finals for 2nd successive time before final qualifier against Hong Kong

భారత్ 2023 ఆసియాకప్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. వరుసగా ఐదో సారి ఫైనల్స్ కు అర్హత పొంది చరిత్ర సృష్టించింది. గ్రూపు డీలో భారత్ ఇంకా తన తుది క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడకుండానే ఏఎఫ్ సీ ఏషియన్ కప్ 2023 ఫైనల్స్ కు అర్హత సాధించడం విశేషం. గ్రూపు బీలో పాలస్థీనా ఫుట్ బాల్ జట్టు.. ఫిలిప్పీన్స్ ను ఓడించడంతో భారత్ కు ఆసియా కప్ ఫైనల్స్ బెర్త్ ఖరారైంది. 

జూన్ 17న భారత ఫుట్ బాల్ టీమ్.. కోల్ కతాలో హాంగ్ కాంగ్ తో తలపడనుంది. భారత జట్టు గ్రూపు డీలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో హాంగ్ కాంగ్ ఉంది. రెండు జట్లూ చెరో ఆరు పాయింట్లు సంపాదించుకున్నాయి. మూడో రౌండు క్వాలిఫయింగ్ మ్యాచ్ ల తర్వాత టాప్ 6 జట్లలో భారత్ టీమ్ కూడా నిలిచింది. 

తన తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్ లో భారత్ జట్టు.. కంబోడియాను ఓడించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పై రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్ లో విజయం సాధించింది. కెప్టెన్ సునీల్ చేత్రి మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రతీ ఆసియాకప్ కు అర్హత సాధించి, తమను తాము మెరుగుపరుచుకుంటూ ఉత్తమ జట్లలో ఒకటిగా నిలవాలన్నది లక్ష్యమని చేత్రి తెలిపాడు. 

  • Loading...

More Telugu News