PM Modi: నిరుద్యోగులకు పండగ!.. 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని ఆదేశం

PM Modi directs recruitment of 10 lakh people in mission mode
  • అన్ని విభాగాల్లోని ఖాళీలపై ఉన్నతస్థాయి సమీక్ష
  • మిషన్ మోడ్ లో ఏడాదిన్నర కాలంలో భర్తీ చేయాలంటూ ఆదేశాలు
  • ప్రకటన విడుదల చేసిన ప్రధాని కార్యాలయం
ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మంది ఉద్యోగుల నియామకానికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖలు, విభాగాల పరిధిలో మానవ వనరుల పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు.  

‘‘అన్ని శాఖల పరిధిలో ఉద్యోగ ఖాళీలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్ లో వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మంది నియామకాలు చేపట్టాలని ఆదేశించారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిపక్షాలు తరచూ నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో ప్రధాని నుంచి ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీల అంశాన్ని వివిధ పార్టీలు తరచూ ప్రస్తావిస్తున్నాయి.
PM Modi
directs
recruitment
Narendra Modi
Prime Minister
unemployment

More Telugu News