Saad Ansari: నుపుర్ శర్మకు మద్దతు పలికాడంటూ ముస్లిం వ్యక్తిపై దాడి

Muslim community people slapped own youth after he supported Nupur Sharma
  • మహ్మద్ ప్రవక్తపై నుపుర్ అనుచిత వ్యాఖ్యలు
  • నుపుర్ శర్మపై ముస్లిం సమాజం ఆగ్రహం
  • నుపుర్ ధైర్యశాలి అని పేర్కొన్న సాద్ అన్సారీ
  • భివాండీలో ఉద్రిక్తతలు
మహ్మద్ ప్రవక్త పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసిందంటూ బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహావేశాలతో ఉంది. ఈ నేపథ్యంలో, నుపుర్ శర్మకు మద్దతు పలికాడంటూ ఓ ముస్లిం యవకుడిపై సాటి ముస్లింలే దాడి చేసిన వైనం మహారాష్ట్రలో వెలుగుచూసింది. భివాండీలో ఈ ఘటన జరిగింది. అతడి పేరు సాద్ అన్సారీ. నుపుర్ శర్మకు సంఘీభావం ప్రకటించడమే కాదు, ఆమెను ధైర్యశాలి అయిన మహిళగా అభివర్ణించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

అయితే, ఇతర ముస్లింల నుంచి అతడికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పెద్ద సంఖ్యలో ముస్లింలు అతడి ఇంటిని ముట్టడించారు. పోస్టులు తొలగించడమే కాకుండా, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆపై ఆ యువకుడిపై దాడికి దిగారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో అక్కడికి వచ్చిన పోలీసులు బాధిత యువకుడ్ని అరెస్ట్ చేశారు. రెండు గ్రూపుల మధ్య మత ప్రాతిపదికన విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నించాడంటూ అతడిపై ఐపీసీ 153 (ఏ) కింద అభియోగాలు మోపారు.
Saad Ansari
Muslims
Nupur Sharma
Bhiwandi
Maharashtra

More Telugu News