Civils: తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన సివిల్స్ విజేతలు

Civils rankers met CM Jagan at Tadepalli camp office
  • ఇటీవల సివిల్స్ ఫలితాల వెల్లడి
  • ఏపీ నుంచి గణనీయ స్థాయిలో ఎంపిక
  • యశ్వంత్ రెడ్డికి 15వ ర్యాంకు
  • సివిల్స్ ర్యాంకర్లను అభినందించిన సీఎం జగన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇటీవలే సివిల్స్-2021 ఫలితాలను వెల్లడించింది. ఏపీ నుంచి గణనీయమైన స్థాయిలో అభ్యర్థులు సివిల్స్ కు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో, ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అభ్యర్థులు నేడు తాడేపల్లి విచ్చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరించిన సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. మెరుగైన రీతిలో ప్రజాసేవ చేయాలని వారికి సూచించారు.  

కాగా, ఈసారి సివిల్స్ లో ఏపీ నుంచి చాలామంది మెరుగైన ర్యాంకులు సాధించారు. నంద్యాలకు చెందిన యశ్వంత్ రెడ్డికి 15వ ర్యాంకు లభించడం విశేషం. విశాఖకు చెందిన పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు, నర్సీపట్నంకు చెందిన మౌర్య భరద్వాజ్ కు 28, కాకినాడ అమ్మాయి కొప్పిశెట్టి కిరణ్మయికి 56, భీమవరంకు చెందిన శ్రీపూజకు 62వ ర్యాంకు, విజయవాడకు చెందిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డికి 69వ ర్యాంకు, నగరికి చెందిన మాలెంపాటి నారాయణ అమిత్ కు 70, రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ కు 99వ ర్యాంకు లభించాయి.
Civils
Rankers
CM Jagan
Tadepalli
Andhra Pradesh

More Telugu News