Angapradakshina: ఈ నెల 15 నుంచి ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు

Tirumala angapradakshina tokens will be issued online
  • కరెంట్ బుకింగ్ స్థానంలో ఆన్ లైన్ విధానం
  • భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్ణయం
  • రోజుకు 750 టోకెన్ల జారీ
  • వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం
తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల జారీని కరెంట్ బుకింగ్ విధానం నుంచి ఆన్ లైన్ పద్ధతిలోకి మార్చారు. స్వామివారి అంగప్రదక్షిణ టోకెన్లను జూన్ 15 నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు పొందేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఇకపై ఆన్ లైన్ లో జారీ చేయనున్నారు. 

జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు టికెట్ల జారీ ప్రారంభం కానుంది. జూన్ 16వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు రోజుకు 750 టోకెన్లను ఆన్ లైన్ విధానంలో కేటాయించనున్నారు. అంగప్రదక్షిణ టికెట్లను tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.
Angapradakshina
Tokens
Online
Tirumala
TTD

More Telugu News