'ఏనుగు' చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు: హీరో అరుణ్ విజయ్

13-06-2022 Mon 15:47 | Entertainment
  • అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా 'ఏనుగు'
  • హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్
  • ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుందన్న అరుణ్
Enugu movie will connect to everyone syas Hero Arun Vijay
అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటకా తెరకెక్కిన 'ఏనుగు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్, సముద్రఖని, యోగి బాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి 'సింగం' సిరీస్ సినిమాలను తెరకెక్కించిన హరి దర్శకత్వం వహించారు. సీహెచ్ సతీశ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ఘనంగా జరిగింది. 

ఈ సందర్భంగా హీరో అరుణ్ మాట్లాడుతూ, తన కెరీర్లోనే 'ఏనుగు' బిగ్గెస్ట్ సినిమా అవుతుందని చెప్పారు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోందని తెలిపారు. ఈ చిత్రం కమర్షియల్, ఎమోషనల్ యాక్షన్ మూవీ అని చెప్పారు. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని... ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.   

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ... 'ఏనుగు' తాను చేసిన 16వ సినిమా అని చెప్పారు. ఇప్పటి వరకు తన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు చెపుతున్నారని అన్నారు. సమాజంలో ఉన్న సమస్యలను ఎంటర్ టైన్ మెంట్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అన్నారు. 

సముద్రఖని మాట్లాడుతూ.. 'ఏనుగు' సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ ఫుల్ గా కనెక్ట్ అవుతారని అన్నారు.  మంచి ఎమోషనల్ తో ఫుల్ ప్యాక్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రియ మాట్లాడుతూ... ఈ సినిమా విడుదల కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని అన్నారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇందులో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.