Varla Ramaiah: దళితుల వైపా? లేక అనంతబాబు వైపా?: జగన్ కు వర్ల రామయ్య ప్రశ్న

Varla Ramaiah question to Jagan
  • మాజీ డ్రైవర్ హత్య కేసులో రిమాండ్ లో ఉన్న అనంతబాబు
  • అనంతబాబును బయటకు తీసుకురావాలనే తపనలో ప్రభుత్వం ఉందన్న వర్ల రామయ్య
  • ముఖ్యమంత్రి గారి దళితవాదం నేతి బీరకాయలో నెయ్యేనా? అని ప్రశ్న
తన మాజీ డ్రైవర్ ను హత్య చేశారనే కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. దళితుడ్ని చంపి, జైలుపాలైన ఎమ్మెల్సీ అనంతబాబును వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలనే తపన ప్రభుత్వంలో అణువణువునా కనిపిస్తోందని అన్నారు. ఈ ప్రభుత్వం హత్యగావించబడిన దళితుడి వైపా? లేక అధికారమదంతో హత్య చేసిన అనంతబాబు వైపా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారి దళితవాదం నేతి బీరకాయలో నెయ్యేనా? అని ఎద్దేవా చేశారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
Anantha Babu

More Telugu News