Sunil Gavaskar: సరైనోడు ఒక్కడూ లేడు..!... భారత బౌలర్లపై గవాస్కర్ సెటైర్లు

  • ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రమే మినహాయింపు అన్న గవాస్కర్
  • వికెట్లు తీసినప్పుడే ప్రత్యర్థిపై ఒత్తిడి తేగలమని సూచన
  • 211 పరుగులను కూడా కాపాడుకోలేకపోవడం అందుకేనని కామెంట్
No wicket taking bowlers Sunil Gavaskar assessment of Indian bowling attack against South Africa

భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను ఏ మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రెండు మ్యాచుల్లో కట్టడిగా బౌలింగ్ చేయగలిగాడు. అంతేకాదు ఎక్కువ వికెట్లు తీసింది కూడా ఇతడే. ముఖ్యంగా రెండో టీ20లో నాలుగు ఓవర్లకు నాలుగు వికెట్లు తీశాడు. అయినా మిగిలిన బౌలర్లలో పసలేకపోవడంతో దక్షిణాఫ్రికా ఉతికి ఆరేసింది. 

దీంతో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వదిలారు. భారత జట్టులో వికెట్లు తీసే వారు లేకపోవడం లోటుగా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నట్టు చెప్పారు.

‘‘భారత స్క్వాడ్ లో వికెట్లు తీసే బౌలర్లు లేకపోవడమే సమస్య. భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్ మాత్రమే ఇందుకు మినహాయింపు. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేయగలవు. రెండు మ్యాచుల్లోనూ భువనేశ్వర్ కుమార్ మినహా మరెవరైనా వికెట్ తీసినట్టు కనిపించారా? 211 పరుగులు చేసి కూడా (మొదటి మ్యాచ్ లో) ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోవడం వెనుక సమస్య ఇదే’’ అని గవాస్కర్ వివరించారు. 

మిగిలిన మూడు మ్యాచులలోనైనా ఉమ్రాన్ మాలిక్ కు ఇండియా అవకాశం ఇచ్చితీరాలని గవాస్కర్ సూచించారు. తాను చూడ్డానికి ఇష్టపడే ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని గవాస్కర్ చెప్పారు. భారత జట్టు వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ లో తలపడనుంది.

More Telugu News