Shakti Kapoor: సిద్ధార్థ కపూర్ వ్యవహారంపై స్పందించిన శక్తికపూర్

Shakti Kapoor reacts to Siddhanth Kapoor detention in Bengaluru drug bust
  • దీని గురించి ఏ మాత్రం అవగాహన లేదన్న బాలీవుడ్ నటుడు
  • వార్తల్లో చూసే నిర్బంధం గురించి తెలుసుకున్నానని కామెంట్  
  • తాము కాల్స్ చేసినా ఎవరూ స్పందించడం లేదని వెల్లడి

తన కుమారుడు సిద్ధార్థ కపూర్ వ్యవహారంపై బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించారు. బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన రేవ్ పార్టీలో సిద్ధార్థ కపూర్ ను అరెస్ట్ చేయడం.. పరీక్షల్లో డ్రగ్స్ సేవించినట్టు వెల్లడి కావడం తెలిసిందే. దీనిపై మీడియా స్పందన కోరగా.. శక్తి కపూర్ తనకు దీని గురించి ఎంతమాత్రం తెలియదన్నారు.

తాను ఉదయం 9 గంటలకు నిద్రలేవగా.. పోలీసులు సిద్ధార్థ కపూర్ ను నిర్బంధించినట్టు వార్తల్లో చూశానని చెప్పారు. ‘‘వార్తలను చూస్తే తెలిసింది. నాకు దీని గురించి ఏ మాత్రం అవగాహన లేదు. మా కుటుంబం మొత్తం దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించింది. కానీ, అవతలి వైపు నుంచి ఎవరూ కాల్స్ తీయడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది’’ అని శక్తి కపూర్ బదులిచ్చారు. సిద్ధార్థ కపూర్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో వెల్లడి కావడం తెలిసిందే.

  • Loading...

More Telugu News