నేడు మరింత పతనమైన రూపాయి
- ఇంట్రాడేలో 78.29 స్థాయి నమోదు
- ఇది అత్యంత కనిష్ఠ స్థాయి
- 36 పైసలు నష్టపోయిన రూపాయి
- డాలర్లకు డిమాండ్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత దూకుడుగా పెంచుతుందన్న అంచనాలతో డాలర్ బలపడింది. మన దిగుమతుల్లో అధిక భాగం డాలర్ మారకంలోనే జరుగుతాయి. అంతర్జాతీయంగా పెరిగిన కమోడిటీ ధరలతో అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ చేస్తుండడం కూడా రూపాయి విలువపై ప్రభావం పడేలా చేస్తోంది. గత శుక్రవారం డాలర్ తో రూపాయి 19 పైసలు నష్టపోయి 77.93 వద్ద క్లోజ్ కావడం గమనార్హం.