బెంగళూరు పోలీసుల అదుపులో శ్రద్ధా కపూర్ సోదరుడు
- ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో రేవ్ పార్టీకి హాజరైన కపూర్
- సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు
- డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో నిర్ధారణ
"సిద్ధార్థ కపూర్ డ్రగ్స్ సేవించినట్టు పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అతడ్ని ఉల్సూర్ పోలీసు స్టేషన్ కు తరలించాం’’ అని బెంగళూరు ఈస్ట్ డివిజన్ డీసీపీ భీమశంకర ఎస్ గులేద్ తెలిపారు.
నటి శ్రద్ధా కపూర్ సోదరుడే సిద్ధార్థ కపూర్. 2020లో వచ్చిన వెబ్ సిరీస్ భౌకాల్ లో సిద్ధార్థ కపూర్ చింటూ దేదా పాత్రలో నటించడం తెలిసిందే. షూటవుట్ ఎట్ వడాల, అగ్లీ, హసీనా పర్కార్ తదితర సినిమాల్లోనూ నటించాడు. ధోల్, చుప్ చుప్ కే తదితర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. డ్రగ్స్ సేవించి అనుమానాస్పద రీతిలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శ్రద్ధాకపూర్ ను విచారించడం తెలిసిందే.