Naveen Jindal: నవీన్ కుమార్ జిందాల్ కు, మా బాస్ నవీన్ జిందాల్ కు సంబంధం లేదు: జిందాల్ స్టీల్స్ స్పష్టీకరణ

Jindal Steels and Power clarifies on mistakenly using Naveen Jindal photograph instead of Naveen Kumar Jindal
  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్
  • సస్పెండ్ చేసిన బీజేపీ
  • మీడియాలో జిందాల్ స్టీల్స్ అధినేత నవీన్ జిందాల్ ఫొటోలు
  • ఓ ప్రకటన చేసిన జిందాల్ స్టీల్స్

ఇటీవల మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్ జాతీయస్థాయిలో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే ఈ వార్తలు రాసే క్రమంలో కొన్ని మీడియా సంస్థలు తమ చైర్మన్ నవీన్ జిందాల్ ఫొటోను వాడుతున్నాయని జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ సంస్థ ఆరోపిస్తోంది. అంతేగాకుండా, సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు కూడా తమ చైర్మన్ సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారని వివరించింది. 

ఇది ఓ వ్యక్తిని మరో వ్యక్తిగా పొరబడడమేనని, ఇలాంటి చర్యలకు మీడియా దూరంగా ఉండాలని సూచించింది. నవీన్ కుమార్ జిందాల్ కు, తమ బాస్ నవీన్ జిందాల్ కు ఎలాంటి సంబంధంలేదని జిందాల్ స్టీల్స్ స్పష్టం చేసింది. మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News