Rakhi Sawant: మాజీ భర్తపై రాఖీ సావంత్ పోలీసులకు ఫిర్యాదు

Rakhi Sawant breaks down says ex husband Ritesh is controlling her social media accounts
  • సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశాడని ఆరోపణ
  • ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేస్తున్నాడన్న రాఖీ
  • తన బోయ్ ఫ్రెండ్ ను చూసి అసూయ పడుతున్నాడని వ్యాఖ్య
రాఖీ సావంత్ తన మాజీ భర్తపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వెంట బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ కూడా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం ఒషివర పోలీసు స్టేషన్ కు వచ్చి ఆమె కేసు దాఖలు చేసింది. తన సోషల్ మీడియా ఖాతాలు, ఆన్ లైన్ చెల్లింపుల విధానాలను తన మాజీ భర్త రితేష్ హ్యాక్ చేసినట్టు ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె ఏడుస్తూ కనిపించింది.

తన కొత్త బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ను చూసి తన మాజీ భర్త రితేష్ అసూయ చెందుతున్నట్టు ఆమె పేర్కొంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. రితేష్ తో తాను కలిసున్నప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను అతడు చూసే వాడని.. అతడి నుంచి వేరుపడిన తర్వాత పాస్ వర్డ్ లను మార్చలేదని ఆమె తెలిపింది.

‘‘నా మాజీ భర్త రితేష్ నాకు ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నాడు. అందుకనే నేను పోలీసు స్టేషన్ కు వచ్చాను. తను నా ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, జీమెయిల్ ఖాతాలను హ్యాక్ చేశాడు. నా ఖాతాలు అన్నింటిలోనూ అతడి నంబర్, అతడి పేరు ఇచ్చాడు. మేము ఇద్దరం కలసి ఉన్నప్పుడు నా ఖాతాల వివరాలు అతడికి ఇచ్చాను. తర్వాత వాటి పాస్ వర్డ్ లు మార్చలేదు. మేము ఇద్దరం స్నేహపూర్వకంగానే విడిపోయాం. అయినా కానీ, అతడు ప్రతీకార ధోరణితోనే వ్యవహరిస్తున్నాడు. నన్ను నాశనం చేస్తానని స్పష్టంగా చెప్పాడు. నేడు మనం ఇన్ స్టా గ్రామ్ ఖాతాల నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నామని తెలుసు. అతడు దాన్ని కూడా హ్యాక్ చేశాడు’’అని మీడియాతో తన బాధను పంచుకుంది రాఖీ సావంత్. 

ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఎలా చెబుతున్నారంటూ? మీడియా ప్రశ్నించగా.. తన ఖాతాలో కలర్స్ టీవీకి వ్యతిరేకంగా విషయాలు పోస్ట్ చేస్తున్నాడని చెప్పింది. ‘‘వాటిని చూసి నేనే వాటిని రాస్తున్నానని టెలివిజన్ ఛానల్ వాళ్లు భావిస్తారు. ఛానల్ వాళ్లు నన్ను బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాడు’’అని సావంత్ వివరించింది.
Rakhi Sawant
ex husband
Ritesh
police
compliant

More Telugu News