సముద్రంలో కొట్టుకుపోయి.. ఇటలీలో కర్నూలు విద్యార్థి మృతి
- మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న దిలీప్
- కోర్సు పూర్తయిన ఆనందంలో బీచ్‌కు
- ఒడ్డున కూర్చున్న అతడిని సముద్రంలోకి లాక్కెళ్లిన అలలు
- కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
పీజీ పూర్తయిన సంతోషంలో శుక్రవారం మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో ఏమరపాటున ఒడ్డున కూర్చున్న దిలీప్‌ను అలలు లాక్కెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన కోస్టుగార్డు సిబ్బంది రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అతడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.