Hyderabad: స్వేచ్ఛ‌ను కోరుకున్నా!... సూసైడ్ నోట్‌లో ప్ర‌త్యూష గ‌రిమెళ్ల‌!

police seized pratyusha garimalla suicide note
  • పోలీసుల చేతిలో ప్ర‌త్యూష సూసైడ్ నోట్‌
  • ఎవ‌రికీ భారం కాద‌ల‌చుకోలేదని వ్యాఖ్య‌
  • ప్ర‌తి రోజూ నేను బాధ‌ప‌డుతూనే ఉన్నానంటూ ఆవేద‌న‌
హైద‌రాబాద్‌లో శ‌నివారం ఆత్మ‌హ‌త్య‌కు గురైన ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యూష గ‌రిమెళ్ల సూసైడ్ నోట్ పోలీసుల‌కు దొరికింది. అందులో ఆమె త‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రంగా వెల్ల‌డించింది. తాను స్వేచ్ఛ‌ను కోరుకున్నాన‌ని అందులో ఆమె పేర్కొంది. అంతే కాకుండా తాను ఎవ‌రికీ భారం కాద‌ల్చుకోలేద‌ని కూడా ఆమె తెలిపారు. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అనేక సార్లు య‌త్నించిన‌ట్లు చెప్పిన ప్ర‌త్యూష‌... ప్ర‌తి రోజు తాను బాధ‌ప‌డుతూనే ఉన్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే... శ‌నివారం రాత్రి ఉస్మానియా ఆసుప‌త్రిలో ప్ర‌త్యూష మృత‌దేహానికి పోస్టు మార్టం పూర్తి అయ్యింది. మ‌రోవైపు మ‌హిళా సెల‌బ్రిటీల‌కు డిజైనింగ్‌లో ప్ర‌త్యూష సిద్ధ‌హ‌స్తురాలని తెలుస్తోంది. దేశంలోని టాప్ 30 ఫ్యాష‌న్ డిజైన‌ర్ల‌లో ప్ర‌త్యూష కూడా ఒక‌ర‌ని స‌మాచారం. టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌తో పాటు ప‌లువురు క్రీడాకారుల‌కు కూడా ఆమె డిజైనింగ్ చేశార‌ని తెలుస్తోంది.
Hyderabad
Hyderabad Police
Pratyusha Garimalla
Fashion Designer
Suicide

More Telugu News