Hyderabad: గ్యాంగ్ రేప్ నిందితుల‌కు పొటెన్సీ టెస్ట్‌లు... ఉస్మానియాలో ప‌రీక్ష‌లు చేయించిన పోలీసులు

hyderabad police conducts potency tests to gang rape accused
  • ఇప్ప‌టికే అరెస్టయిన ఆరుగురు నిందితులు
  • కోర్టు అనుమ‌తితో వారిని క‌స్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు
  • ఆరుగురు నిందితుల‌కూ లైంగిక సామ‌ర్థ్య పరీక్ష‌లు
  • నివేదిక‌ల‌ను నేరాభియోగ‌ప‌త్రానికి జ‌త చేయ‌నున్న పోలీసులు
హైద‌రాబాద్‌లో పెను క‌ల‌కలం రేపిన మైన‌ర్ బాలిక‌పై జ‌రిగిన గ్యాంగ్ రేప్‌కు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు శ‌నివారం కీల‌క చ‌ర్య‌కు ఉప‌క్ర‌మించారు. బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్ద ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు అనుమ‌తితో వారిని క‌స్ట‌డీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌డ‌చిన మూడు రోజులుగా నిందితుల‌ను విచారిస్తున్న పోలీసులు శ‌నివారం నిందితుల‌ను ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

నిందితుల‌కు లైంగిక సామ‌ర్ధ్య ప‌రీక్ష‌లు చేయించేందుకే వారిని పోలీసులు ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సదరు ప‌రీక్ష‌ల అనంతరం పోలీసులు తిరిగి నిందితుల‌ను పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మైన‌ర్ బాలురు అత్యాచారానికి ఎలా పాల్ప‌డ‌తార‌న్న వాద‌న‌ల‌ను ప‌టాపంచ‌లు చేసే దిశ‌గానే పోలీసులు నిందితుల‌కు లైంగిక సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు చేయించిన‌ట్టు స‌మాచారం. ఈ ప‌రీక్ష‌ల నివేదిక‌ల‌ను పోలీసులు నేరాభియోగ‌ప‌త్రానికి జ‌త చేయ‌నున్నారు. ఈ కేసులో ప‌క్కా సాక్ష్యాధారాలు సేక‌రించాల‌న్న దిశ‌గా సాగుతున్న క్ర‌మంలోనే పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు స‌మాచారం.
Hyderabad
Hyderabad Police
Gang Rape
Jubilee Hills PS
Osmania Hospitaol

More Telugu News