Himanshu: చెంగిచెర్లలో ఓ శుభకార్యానికి హాజరైన కేటీఆర్ తనయుడు హిమాన్షు

Himanshu visits Chengicherla
  • స్వాగతం పలికిన బోడుప్పల్ కార్పొరేషన్ వర్గాలు
  • మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ మేయర్ 
  • ఫొటోలు పంచుకున్న డిప్యూటీ మేయర్ లక్ష్మీ గౌడ్ 
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు చెంగిచెర్లలో ఓ శుభకార్యానికి హాజరై సందడి చేశాడు. చెంగిచెర్ల విచ్చేసిన హిమాన్షుకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా హిమాన్షును బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆమె ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా, ఈ ఫొటోల్లో హిమాన్షు స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చాడు.

హిమాన్షు... ఇటీవల ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఎన్నికల్లో క్రియేటివ్ యాక్షన్ సర్వీసెస్ విభాగం ప్రెసిడెంట్ గా గెలిచిన సంగతి తెలిసిందే. సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే హిమాన్షుకు డయానా అవార్డు కూడా అభించింది.
Himanshu
Chengicherla
Boduppal
KTR
TRS
Telangana

More Telugu News