Ravi Shastri: టీ20 ప్రపంచకప్ కు ఉమ్రాన్ మాలిక్ ను ఆడించొద్దు: రవిశాస్త్రి

Should Umran Malik Be Picked For Indias T20 World Cup Squad Ravi Shastri Says No
  • అతడికి అంత అనుభవం లేదన్న మాజీ కోచ్
  • అప్పుడే టీ20ల్లో ఆడించొద్దంటూ సూచన
  • వన్డే, టెస్టుల్లో అవకాశం ఇచ్చి చూడాలన్న అభిప్రాయం

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తురుపు ముక్క, జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేయవద్దంటూ మాజీ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సూచించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ కు సెలక్టర్లు ఉమ్రాన్ మాలిక్ ను కూడా ఎంపిక చేయడం తెలిసిందే. నెట్ ప్రాక్టీస్ లోనూ అతడు చురుగ్గా పాల్గొంటున్నాడు. మాలిక్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ లో కూడా ప్రాతినిధ్యం వహించలేదు. ప్రస్తుత సిరీస్ లో ఏవైనా అవకాశం లభిస్తుందేమో చూడాలి.

ఈ తరుణంలో రవిశాస్త్రి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్లకు మించిన వేగంతో బంతులను సంధించి మంచి ప్రదర్శన చేయడం చూశాం. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో మ్యాచుల్లో అవకాశం వస్తే సత్తా చూపిస్తాడేమో? అన్న అంచనాలున్నాయి. అయినా, అతడు ఇంకా ఎంతో మెరుగుపడాలని, అనుభవం సంపాదించాల్సి ఉందని రవిశాస్త్రి అన్నారు. అతడికి అప్పుడే అంచనాలతో అవకాశం ఇవ్వడం తొందరపాటు అవుతుందన్నాడు.

‘‘అప్పుడే టీ20ల్లో ఆడించొద్దు. ముందు అతడ్ని అనుభవం సంపాదించనీయండి. జట్టు వెంట తీసుకెళ్లండి. వీలుంటే 50 ఓవర్ల మ్యాచుల్లో (వన్డేల్లో) ఆడించండి. రెడ్ బాల్ క్రికెట్ (టెస్ట్) అయినా ఫర్వాలేదు. అతడ్ని టెస్టుల్లో తీర్చిదిద్దాలి. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి’’ అని రవిశాస్త్రి తన అభిప్రాయాలను తెలియజేశాడు.

  • Loading...

More Telugu News