Justin Bieber: జస్టిన్ బీబర్ కు ముఖ పక్షవాతం

  • రామ్ సే హంట్ సిండ్రోమ్ బారిన పడిన కెనడా గాయకుడు
  • ఇందులో భాగమే ముఖానికి పక్షవాతమని ప్రకటన
  • కుడి కన్ను ఆర్పలేనని వివరణ
  • ఇన్ స్టా గ్రామ్ లో వీడియో షేర్
Justin Bieber says he is suffering from facial paralysis

కెనడాకు చెందిన ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ (28) తాను ముఖ పక్షవాతానికి గురైనట్టు ప్రకటించాడు. ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్న ఈ గాయకుడు ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో షేర్ చేశాడు. రామ్ సే హంట్ సిండ్రోమ్ (వ్యాధి)తో బాధపడుతున్నట్టు తెలిపాడు. ఈ వ్యాధిలో భాగమే ముఖానికి పక్షవాతమని.. కన్ను కూడా ఆర్పలేనని వివరించాడు. ముఖంలో నాడీ వ్యవస్థ దెబ్బతిన్నట్టు ప్రకటించాడు.

ఈ వ్యాధి కారణంగా జస్టిన్ బీబర్ టొరంటో, వాషింగ్టన్ డీసీ తదితర పర్యటనలను రద్దు చేసుకున్నాడు. తాను పూర్తిగా కోలుకునే వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు ఉండవని ప్రకటించాడు. కుడికన్ను పూర్తిగా మూతపడని పరిస్థితిని అతడు ఎదుర్కొంటున్నాడు. ఎడమకన్ను మాదిరిగా కదలికలు సాధారణంగా లేకపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. 

వీడియోలో తన సమస్యను జస్టిన్ బీబర్ వివరించాడు. ‘ముఖ్యమైనది దయచేసి చూడండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా కోసం ప్రార్థించండి’ అనే క్యాప్షన్ తగిలించాడు. (వీడియో కోసం)

More Telugu News