'ఖైదీ 2' లైన్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్!

  • 2019లో వచ్చిన ' ఖైదీ' బ్లాక్ బస్టర్ హిట్ 
  • ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసిన లోకేశ్ కనగరాజ్
  • ఫ్లాష్ బ్యాక్ తో మొదలు కానున్న సీక్వెల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే  అవకాశం 
Khaidi 2 Movie Date

లోకేశ్ కనగరాజ్ పేరు వినగానే కార్తి హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'ఖైదీ' సినిమా గుర్తుకు వస్తుంది. పెద్దగా ఖర్చు లేకుండా ఆయన తెరకెక్కించిన ఆ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. అంత తక్కువ ఖర్చుతో .. పోలీసులనే ఒక ఖైదీ కాపాడటమనే కొత్త ఆలోచనతో ఆయన రూపొందించిన ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. 
 
విజయ్ తో 'మాస్టర్' .. కమల్ తో 'విక్రమ్' సినిమా చేసే అవకాశాన్ని లోకేశ్ కి కల్పించింది 'ఖైదీ' సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉందని లోకేశ్ చాలా రోజుల క్రితమే చెప్పాడు. 'ఖైదీ' అనే టైటిల్  తోనే ఈ సినిమా నిర్మితమవుతుందని అన్నాడు. 

 తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతుంది. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో కప్పులు గెలుచుకుంటాడు. ఆ తరువాత మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి, తన కూతురును తీసుకుని వెళ్లిపోతాడు. మళ్లీ పోలీసులకు ఆయన అవసరం వస్తుంది. అందుకు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలతో ఈ కథ నడుస్తుందని ఆయున చెప్పుకొచ్చాడు.

More Telugu News