Shadab Khan: మ్యాచ్ జరుగుతుండగా పరిగెత్తుకుంటూ పిచ్‌పైకి వచ్చిన అభిమాని.. హత్తుకుని పంపిన పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్

spectator came to field and salutes pak cricketer shadab khan
  • పాక్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఘటన
  • షాదాబ్ వద్దకు వచ్చి సెల్యూట్ చేసిన అభిమాని
  • ఆప్యాయంగా హత్తుకుని పంపిన క్రికెటర్
  • వైరల్ అవుతున్న వీడియో
క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండగా అభిమానులు అప్పుడప్పుడు మైదానంలోకి దూసుకొచ్చి అభిమాన క్రికెటెర్లను కలిసే ప్రయత్నం చేయడం మామూలు విషయమే. వారు అలా మైదానంలోకి రాగానే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని బయటకు పంపడం కూడా చూస్తుంటాం. తాజాగా పాకిస్థాన్‌-వెస్టిండీస్ మధ్య ముల్తాన్‌లో జరిగిన రెండో వన్డేలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది.  

 పాక్ ఆల్‌రౌండర్, ఆ జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ క్రీజులో ఉన్న షాదాబ్ వద్దకు వచ్చాడు. ఆపై అతడిని చూసి సెల్యూట్ చేశాడు. దీంతో షాదాబ్ కూడా అంతే వేగంగా స్పందించాడు. ఆ అభిమానిని దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకున్నాడు. ఈ ఊహించని పరిణామానికి అభిమాని ఉబ్బితబ్బిబ్బవుతూ వచ్చినంత వేగంగా మైదానాన్ని వీడాడు. కరోనా నేపథ్యంలో బయోబబుల్‌లో ఉన్నప్పటికీ తన వద్దకు వచ్చిన అభిమానిని కోప్పడకుండా ఆప్యాయంగా హత్తుకున్న షాదాబ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మీరూ చూసేయండి.
Shadab Khan
Pakistan
West Indies
Spectator

More Telugu News