Pranitha: పండంటి పాపాయికి జన్మనిచ్చిన ప్రణీత

Pranitha gives birth to baby girl
  • గతేడాది పెళ్లి చేసుకున్న ప్రణీత
  • వ్యాపారవేత్త నితిన్ రాజుతో వివాహం
  • తల్లయిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ప్రణీత
అందాల నటి ప్రణీత తల్లయింది. పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తమ జీవితంలోకి ముద్దుల పాపాయి అడుగుపెట్టిందని ప్రణీత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గత కొన్నిరోజులుగా నమ్మశక్యం కాని రీతిలో కాలం గడిచిపోయిందని ప్రణీత మాతృత్వపు సంతోషాన్ని పంచుకుంది. ఈ మేరకు తన పేగు తెంచుకు పుట్టిన బిడ్డను చేతుల్లో పొదివిపట్టుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేసింది. ప్రణీత గతేడాది మే నెలలోనే వివాహం చేసుకుంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత పరిణయం జరిగింది.
Pranitha
Baby Girl
Birth
Bengaluru
Tollywood

More Telugu News