Modi: పాఠాలు చెప్పిన గురువును కలిసి ఆశీస్సులు అందుకున్న ప్రధాని మోదీ

PM Modi met his childhood teacher in Vadnagar
  • గుజరాత్ లో మోదీ ఒక్కరోజు పర్యటన
  • వివిధ ప్రాజెక్టుల ప్రారంభం
  • వాద్ నగర్ లో గురువును కలిసిన వైనం
  • మోదీని చూసి భావోద్వేగాలకు గురైన గురువు
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. నవ్ సారి ప్రాంతంలోని వాద్ నగర్ వెళ్లిన ఆయన తనకు బాల్యంలో పాఠాలు చెప్పిన గురువును కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన యోగక్షేమాలను ఆరా తీశారు. మోదీని చూడగానే ఆ గురువులో ఆనందం ఉప్పొంగింది. తన శిష్యుడు ఇవాళ దేశ ప్రధాని అయ్యాడన్న సంతోషం వెల్లివిరిసింది. మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Modi
Teacher
Vadnagar
Navsari
Gujarat

More Telugu News