KTR: రాహుల్ గాంధీ, బండి సంజయ్ లపై కేటీఆర్ విమర్శలు

KTR comments on Rahul Gandhi and Bandi Sanjay
  • రాహుల్ కు పబ్ ల గురించి తప్ప వడ్ల గురించి ఏం తెలుసన్న కేటీఆర్ 
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప బండి సంజయ్ చేసేదేముందని ప్రశ్న 
  • బండి సంజయ్ విచిత్రమైన వ్యక్తి అన్న కేటీఆర్ 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రాహుల్ గాంధీ అడుగుతున్నారని... 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ కు పబ్ ల గురించి తెలుసని, వడ్ల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. 

ఇక మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప బండి సంజయ్ చేసేది ఏముందని మండిపడ్డారు. జన్ ధన్ ఖాతాల్లో నగదు వేస్తామన్నారని... ఇప్పటి వరకు వేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేముందని అడిగారు. మసీదులు తవ్వాలని బండి సంజయ్ అంటాడని... ఆయనకు సిగ్గూశరం ఉందా? అని ప్రశ్నించారు. ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి అని అన్నారు.
KTR
TRS
Rahul Gandhi
Congress
Bandi Sanjay
BJP

More Telugu News