తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న 'ఏనుగు'

10-06-2022 Fri 15:09 | Entertainment
  • ఈ నెల 17న విడుదలవుతున్న 'ఏనుగు'
  • అరుణ్ విజయ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని ప్రధాన పాత్రలను పోషించిన చిత్రం
  • తమిళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'యానై'కు ఇది తెలుగు వర్షన్
Enugu movies is cominng to entertain Telugu audience
ఎన్నో హిట్ సినిమాలను ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేసిన సీహెచ్ సతీశ్ కుమార్... ఆ తర్వాత నిర్మాతగా మారి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఆయన హీరో ధనుష్ తో 'ధర్మయోగి' సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 'బూమరాంగ్', 'లోకల్ బోయ్స్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో చాలా గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా తన సొంత బ్యానర్ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై... తమిళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'యానై' చిత్రాన్ని... తెలుగులో 'ఏనుగు' పేరుతో విడుదల చేస్తున్నారు. 

'ఏనుగు' చిత్రంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి వంటి నటులు నటించారు. దర్శకుడు హరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ స్టార్ హీరో సూర్యతో 'సింగం' సిరీస్, విశాల్ తో 'పూజ' వంటి యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకున్నారు. 

ఈ నెల 12న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ... మంచి కంటెంట్ తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 12 న జరుపుకొని ఇదే నెల 17 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సహ నిర్మాతగా వేదికకారన్ పట్టి ఎస్. శక్తివేల్ వ్యవహరిస్తున్నారు.