ట్రాక్టర్ పై మొన్న జగన్... ఇప్పుడు షర్మిల!

  • మొన్న ట్రాక్టర్ నడిపిన జగన్
  • ఇప్పుడు పాదయాత్రలో ట్రాక్టర్ డ్రైవ్ చేసిన షర్మిల
  • వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
YS Sharmila drives tractor

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్రాక్టర్ నడిపిన సంగతి తెలిసిందే. వైయస్ యంత్ర సేవ పథకం ప్రారంభం సందర్భంగా ఆయన ట్రాక్టర్ నడిపారు. తాజాగా జగన్ సోదరి, వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా ట్రాక్టర్ తోలారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఆమె పాదయాత్ర ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా గన్నవరం గ్రామంలో ఆమె తన తండ్రి వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు తలపాగా చుట్టి ట్రాక్టర్ నడిపారు. గన్నవరం నుంచి ఖానాపూర్ గ్రామం వరకు ట్రాక్టర్ డ్రైవ్ చేశారు. వైయస్ అభిమానులు, రైతులు ఆమె వెనుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆమె తండ్రి వైయస్ పాదయాత్ర సందర్భంగా తలకు పాగా చుట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు షర్మిల ట్రాక్టర్ నడిపిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News