Nayanthara: నయనతారకు శుభాకాంక్షలు తెలిపిన రోజా

Roja greets Nayanthara and Vignesh Sivan
  • తన ప్రియుడు విఘ్నేశ్ ను పెళ్లాడిన నయనతార
  • మహాబలిపురంలో ఆడంబరంగా జరిగిన వివాహం
  • 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ రోజా శుభాకాంక్షలు

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ఓ విలాసవంతమైన రిసార్టులో వీరి వివాహం ఘనంగా జరిగింది. రజనీకాంత్, విజయ్, షారుఖ్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు వీరి వివాహ వేడుకకు తరలి వచ్చారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం ఆడంబరంగా జరిగింది. వీరి పెళ్లి ఫొటోలను విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 

మరోవైపు కొత్త జంటకు ఏపీ మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. నయనతార, విఘ్నేష్ ల వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. ఇద్దరికీ 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News