Andhra Pradesh: ఫ్యాన్సీ నెంబ‌ర్ల‌ రుసుము రూ.2 ల‌క్ష‌ల‌కు పెంచిన ఏపీ ర‌వాణా శాఖ

  • ప్ర‌స్తుతం రూ.5 వేలుగా రుసుము
  • రూ.5 వేలు చెల్లించి ఫ్యాన్సీ నెంబ‌ర్ల వేలంలో పాల్గొనే అవ‌కాశం
  • తాజాగా దీనిని రూ.2 ల‌క్ష‌ల‌కు పెంచిన ఏపీ ర‌వాణా శాఖ‌
  • మోటారు వాహ‌నాల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేస్తూ కీల‌క నిర్ణ‌యం
ap transport department fancy numbers fares

ఏపీ ప్ర‌భుత్వం గురువారం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వాహ‌నాల ఫ్యాన్సీ నెంబ‌ర్ల ప్రాథ‌మిక రుసుమును భారీగా పెంచుతూ ఏపీ ర‌వాణా శాఖ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం వాహ‌నాల ఫ్యాన్సీ నెంబ‌ర్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొన‌వ‌చ్చు. అయితే తాజాగా ఈ రుసుమును రూ.2 ల‌క్ష‌ల‌కు పెంచుతూ ఏపీ ర‌వాణా శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మోటారు వాహ‌నాల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌ను చేస్తూ ఏపీ ర‌వాణా శాఖ గురువారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ర‌వాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఫ్యాన్సీ నెంబ‌ర్లు కావాల‌నుకునే వారు రూ.5 వేల‌కు బ‌దులుగా రూ.2 ల‌క్ష‌ల‌ను ప్రాథ‌మిక రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News