Surabhi Babji: సుర‌భి నాట‌క క‌ళాకారుడు నాగేశ్వ‌ర‌రావు క‌న్నుమూత‌

  • నాట‌క రంగంలో తొలి ప‌ద్మ‌శ్రీ అందుకున్న బాబ్జి
  • కొంత‌కాలంగా అనారోగ్యంతో స‌త‌మ‌తం
  • హైద‌రాబాద్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచిన వైనం
సుర‌భి నాట‌క క‌ళాకారుడు నాగేశ్వ‌ర‌రావు అలియాస్ సుర‌భి బాబ్జి (76) గురువారం సాయంత్రం క‌న్నుమూశారు. హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న త‌న నివాసంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన.. ఈ రోజు పరిస్థితి విషమించడంతో మరణించారు. 

నాట‌క రంగంలో తొలి ప‌ద్మ‌శ్రీ అవార్డును ద‌క్కించుకున్న క‌ళాకారుడిగా సుర‌భి బాబ్జికి మంచి గుర్తింపు ఉంది. పేరు నాగేశ్వ‌ర‌రావు అయినా సురభి నాట‌క క‌ళ‌తో ఆయ‌న పేరు సుర‌భి బాబ్జిగా మారిపోయింది.
Surabhi Babji
Hyderabad
Padmashree

More Telugu News