ఆ సినిమాను ఆపేశాము .. క్లారిటీ ఇచ్చిన నితిన్ తండ్రి!

  • గతంలో నితిన్ ప్రకటించిన 'పవర్ పేట'
  • ఆ తరువాత రాని అప్ డేట్స్ 
  • ఆ ప్రాజెక్టు లేదని తేల్చిన నితిన్ తండ్రి 
  • త్వరలో నితిన్ నుంచి రానున్న 'మాచర్ల నియోజకవర్గం'
Power Peta Movie update

నితిన్ 'పవర్ పేట' అనే సినిమా చేయనున్నట్టు కొంతకాలం క్రితం ఒక ప్రకటన వచ్చింది. నితిన్ సొంత బ్యానర్లో కృష్ణచైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని పేర్కొన్నారు. ఆ తరువాత నితిన్ వేరే సినిమాలు చేస్తూ వెళుతున్నాడుగానీ, ఈ సినిమా ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. తాజాగా ఈ సినిమా విషయంలో స్పష్టత వచ్చేసింది.


కమల్ 'విక్రమ్' సినిమాను తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన వద్ద 'పవర్ పేట' సినిమా ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన స్పందిస్తూ "ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాకపోవడంతో, ఆ ప్రాజెక్టును ఆపేశాము" అంటూ స్పష్టం చేశారు.

ఇక త్వరలో నితిన్ నుంచి 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రానుంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఆ తరువాత సినిమాను ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల సందడి చేయనుంది. ఈ ఏడాదిలో నితిన్ కి గట్టి హిట్ పడుతుందేమో చూడాలి మరి.

More Telugu News