Nayanthara: నయతార, విఘ్నేశ్ శివన్ ల పెళ్లి ఫొటోలు ఇవిగో!

  • మహాబలిపురంలో ఘనంగా వివాహ వేడుక
  • హాజరైన రజనీ, షారుఖ్, విజయ్ తదితర ప్రముఖులు
  • ఇప్పుడే పెళ్లయిందని చెప్పిన విఘ్నేశ్ శివన్
First pic of Nayanthara and Vignesh Sivan

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల పెళ్లి ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లికి రజనీకాంత్, షారుఖ్ ఖాన్, విజయ్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని విఘ్నేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. భగవంతుడు, ఈ ప్రపంచం, అందరి ఆశీర్వాదాలతో ఇప్పుడే తమ పెళ్లి అయిందని చెప్పాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.

More Telugu News