Andhra Pradesh: 2022-23 ఏపీ వార్షిక రుణ ప్ర‌ణాళిక ఖ‌రారు... ఏ రంగానికి ఎంత అంటే?

ap cm ys jagan finalize ap loan plan in slbc meeting
  • వ్యవసాయ రంగానికి రూ.1,64,740కోట్లు
  • ప్రాథమిక రంగానికి మాత్ర‌మే రూ. 2,35,680 కోట్లు
  • ఏపీ వార్షిక రుణ ప్రణాళిక మొత్తం విలువ‌ను రూ.3,19,480 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం (2022-23)కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్షిక రుణ ప్ర‌ణాళిక ఖ‌రారైంది. ఈ మేర‌కు గురువారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశం (ఎస్ఎల్‌బీసీ) ఈ రుణ ప్ర‌ణాళిక‌ను ఖ‌రారు చేసింది. ఈ స‌మావేశానికి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హాజ‌రు కాగా...రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మాత్రం గైర్హాజ‌ర‌య్యారు. 

ఏపీ వార్షిక రుణ ప్రణాళిక మొత్తం విలువ‌ను రూ.3,19,480 కోట్లుగా ఖ‌రారు చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించ‌గా... కేవ‌లం ప్రాథమిక రంగానికి మాత్ర‌మే రూ. 2,35,680 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణ‌యించారు. మిగిలిన మొత్తాన్ని ఇత‌ర రంగాల‌కు కేటాయించారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Agriculture

More Telugu News