KTR: రేప్ లు చేసిన మైనర్లకు కూడా పెద్దలకు విధించే శిక్షలనే విధించాలి: కేటీఆర్

I welcome stand of TS police says KTR
  • జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటి వరకు ఆరుగురి అరెస్ట్
  • వీరిలో ఒకరు మేజర్.. ఐదుగురు మైనర్లు
  • మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించాలని కోర్టును కోరే యోచనలో పోలీసులు
జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ కోర్టును కోరే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అత్యాచారం వంటి అత్యంత దుర్మార్గమైన నేరాలకు పాల్పడే వారికి మేజర్లకు విధించే శిక్షలనే విధించాలని అన్నారు.
KTR
TRS
Rape

More Telugu News