Balakrishna: రేపు బాలయ్య జన్మదినం.. గుంటూరులో భారీ అన్నదానానికి ఏర్పాట్లు

Huge annadanam in Guntur in the eve of balakrishna birthday
  • రేపు 62వ జన్మదినాన్ని జరుపుకుంటున్న బాలయ్య
  • గుంటూరులో రేపు 15 వేల మందికి అన్నదానం చేస్తామన్న ఎన్టీఆర్-యూఎస్ఏ ప్రతినిధి
  • బాలకృష్ణ సేవా కార్యక్రమాలే తమకు స్ఫూర్తి అన్న ఉయ్యూరు శ్రీనివాస్
టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు 62వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో భారీ అన్నదానానికి ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్-యూఎస్ఏ ప్రతినిధి ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిన్న ఎన్టీఆర్ అభిమానులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాలకృష్ణ సేవా కార్యక్రమాలే తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో గుంటూరులో బాలకృష్ణ చేతుల మీదుగా అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్టు చెప్పారు. గుంటూరులోని అన్ని డివిజన్లలో రేపు భారీగా అన్నదానం చేస్తున్నట్టు చెప్పారు. దాదాపు 15 వేల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాస్ తెలిపారు.
Balakrishna
Birth Day
Guntur
Tollywood
Hindupur

More Telugu News