జనసైనికులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసిన పార్టీ హైకమాండ్

08-06-2022 Wed 22:15 | Andhra
  • ప్రత్యర్థులు మైండ్ గేమ్ కు తెరదీశారన్న జనసేన
  • పార్టీ శ్రేణులు జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టీకరణ
  • సోషల్ మీడియాలో మార్గదర్శకాల విడుదల
New guidelines for Janasena cadre
జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు పార్టీ హైకమాండ్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రత్యర్థులు మైండ్ గేమ్ కు తెరదీసినట్టు కొన్ని సంఘటనలు చెబుతున్నాయని పార్టీ అధినాయకత్వం పేర్కొంది. జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికో, కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికో కొన్ని అనూహ్యమైన ప్రచారాలను ప్రత్యర్థులు వ్యాపింపజేస్తున్నారని వివరించింది. 

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు పాటించాల్సిన మార్గదర్శకాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.