Nani: తెలుగులోను ఫహాద్ తో కలిసి యాక్ట్ చేయాలనుంది: నజ్రియా

  • తమిళ .. మలయాళ భాషల్లో నజ్రియాకి క్రేజ్
  • 'అంటే .. సుందరానికీ' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం 
  • ఈ నెల 10వ తేదీన సినిమా విడుదల 
  • మంచి కథల కోసమే వెయిటింగ్ అంటూ చెప్పిన నజ్రియా
Nzria Laerst Interview

తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా నజ్రియాకి మంచి క్రేజ్ ఉంది.  అయితే ఆ క్రేజ్ ను ఉపయోగించుకుని చకచకా సినిమాలలో చేసేయడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదు. సినిమాకి .. సినిమాకి ఆమె చాలా గ్యాప్ తీసుకునేది. అందువల్లనే  పదేళ్ల తన కెరియర్లో చాలా తక్కువ సినిమాలు కనిపిస్తాయి.
 
ఇంతకాలంగా ఆమె టాలీవుడ్ కి కూడా అందుబాటులో లేదు. 'అంటే .. సుందరానికీ' సినిమాలో మాత్రం ఆమె చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో నాని గట్టిగానే ట్రై  చేసి ఆమెను ఒప్పించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " మంచి కథల కోసమే నేను వెయిట్  చేస్తుంటాను .. అందువల్లనే నా సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. 

మలయాళంలో నేను, నా భర్త ఫహాద్ కలిసి నటించాము. తెలుగులో కూడా ఇద్దరం కలిసి నటించాలని ఉంది. మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా చేస్తాము" అంటూ చెప్పుకొచ్చింది. టాలీవుడ్ నచ్చింది .. ఇక్కడి వర్కింగ్ స్టైల్ నచ్చిందని పలు ఇంటర్వ్యూల్లో నజ్రియా చెబుతోంది. చూస్తుంటే ఇక్కడి హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగానే కనిపిస్తోంది.

More Telugu News