Mohamood Ali: రేప్ కేసులో నా మనవడు ఉన్నాడని దుష్ప్రచారం చేశారు: హోంమంత్రి మహమూద్ అలీ

  • జూబ్లీహిల్స్ రేప్ ఘటన దురదృష్టకరమన్న హోంమంత్రి 
  • పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సూచన 
  • కేసును పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారని కితాబు 
Home minister Mohamood Ali response on gang rape

హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహబూబ్ అలీ మనవడిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, రేప్ కేసులో తన మనవడు కూడా ఉన్నాడని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సామూహిక అత్యాచారం ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు.

మహిళలపై అత్యాచారాలు, దాడులు జరగకుండా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్ఠమైనటువంటి చర్యలను తీసుకుంటోందని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ను తొలగించడం తన పరిధిలో లేదని... దాని గురించి బోర్డు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విపక్షాల ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

More Telugu News