Jay Shah: మిథాలీరాజ్‌కు బెస్ట్ విషెస్ చెప్పిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా

jay shah tweet on mithali raj reirement for cricket
  • క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్‌
  • మిథాలీ సేవ‌ల‌ను కీర్తిస్తూ జై షా ట్వీట్‌
  • భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు మిథాలీ వ‌న్నె తెచ్చింద‌ని ప్ర‌శంస‌
అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భార‌త స్టార్ క్రికెట‌ర్ మిథాలీరాజ్‌కు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా బెస్ట్ విషెస్ చెప్పారు. క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతూ మిథాలీరాజ్ ప్ర‌కట‌న చేసిన మ‌రుక్ష‌ణ‌మే స్పందించిన జై షా...ట్విట్ట‌ర్ వేదికగా ఆమెను కీర్తిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

అత్య‌ద్భుతంగా సాగిన మిథాలీరాజ్ త‌న కెరీర్‌ను ముగించింద‌ని చెప్పిన జై షా... భార‌త క్రికెట్‌కు చేసిన విశేష సేవ‌ల‌కు గాను ఆమెకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మిథాలీరాజ్ నాయ‌క‌త్వ ప‌టిమ జాతీయ మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు ఎంతో వ‌న్నె తెచ్చింద‌ని ఆయ‌న కీర్తించారు. ఇన్నేళ్ల‌పాటు మైదానంలో మెరుగ్గా రాణించినందుకు మిథాలీకి జై షా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మిథాలీ త‌న త‌దుప‌రి ఇన్నింగ్స్‌లో రాణించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు జై షా ఆశాభావం వ్య‌క్తం చేశారు.
Jay Shah
BCCI
Cricket
Team India
Mithali Raj

More Telugu News