Salman Khan: భారీ సెక్యూరిటీతో హైదరాబాదులో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్

Salman Khan enters Hyderabad with high security
  • రామోజీ ఫిల్మ్ సిటీలో సల్మాన్ సినిమా షూటింగ్
  • చంపేస్తామంటూ సల్మాన్ కు గ్యాంగ్ స్టర్ బెదిరింపులు
  • సల్మాన్ కు భద్రతను పెంచిన ముంబై పోలీసులు
తన తాజా చిత్రం 'కబీ ఈద్ కబీ దివాలి' చిత్రం షూటింగ్ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాదుకు వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు సల్మాన్ ను చంపేస్తామంటూ ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధును చంపినట్టు చంపుతామని ఒక లేఖను విడుదల చేశాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. ఈ క్రమంలో, గతంలో ఎన్నడూ లేనంత భద్రతతో ఆయన హైదరాబాద్ లో అడుగుపెట్టారు.
Salman Khan
Bollywood
Security
Hyderabad

More Telugu News