Kanpur: మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ట్వీట్లు.. కాన్పూరు బీజేపీ నేత అరెస్ట్

Kanpur BJP leader arrested for derogatory tweets against Prophet
  • మహ్మద్ ప్రవక్తను అవమానించేలా ట్వీట్లు చేసిన హర్షిత్ శ్రీవాస్తవ
  • ఆయన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయన్న పోలీసులు
  • తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నామన్న పోలీసులు
మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ట్వీట్లు చేసిన కాన్పూరు బీజేపీ నేత హర్షిత్ శ్రీవాస్తవను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ యూత్ వింగ్, స్టూడెంట్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న హర్షిత్.. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచేలా ట్వీట్లు చేశారు. ఆయన పోస్టులు అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు తక్షణం చర్యలు తీసుకుని కేసు నమోదు చేసినట్టు కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారి విజయ్ సింగ్ మీనా తెలిపారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 

ఈ విషయంలో ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉందని, ఎవరైనా మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, లేదంటే సామాజిక సామరస్యానికి భంగం కలిగించే యత్నం చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా, ఇటీవల ఓ టీవీ చర్చల్లో పాల్గొన్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఇంటాబయట తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో స్పందించిన బీజేపీ నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
Kanpur
BJP
Nupur Sharma
Prophet Mohammad
Harshit Srivastava

More Telugu News