కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చర్యలకు రాహుల్ రెడీ.. అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర!

  • కన్యాకుమారి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న రాహుల్ గాంధీ
  • ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర
  • రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్న టీఎన్‌సీసీ
Rahul Gandhi To start Pada Yatra from Kanyakumari

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతోపాటు పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ అందుకు నడుంబిగించింది. ప్రజల్లోకి వెళ్లాలని, పాదయాత్ర చేయాలని రాజస్థాన్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో నిర్ణయించిన ఆ పార్టీ అందుకు సన్నద్ధమవుతోంది. 

గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు సమాచారం. ఆ రోజున తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) వర్గాల ద్వారా తెలిసింది. ప్రతి జిల్లాలోనూ కనీసం 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నట్టు సమాచారం.

More Telugu News