Doctors: కొత్తగా వచ్చే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయడంపై నిషేధం... కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం

  • ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు
  • కొత్తగా వచ్చే వైద్యులకు నిబంధన
  • సర్వీస్ రూల్స్ మార్పు
  • తాజాగా ఉత్తర్వులు జారీ
Telangana govt crucial decision on doctors private practice

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోకి నేరుగా నియమితులయ్యే డాక్టర్లు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, బోధనా రంగంలో నాన్ టీచింగ్ నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ అయ్యే వైద్య నిపుణులు కూడా ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదని పేర్కొంది.  ఈ మేరకు సర్వీస్ నిబంధనలను మార్పు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు నేడు వెలువడ్డాయి. అయితే, ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వైద్యులకు ఈ నిబంధన వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

More Telugu News